LOADING...
Special Trains : వేసవి రద్దీకి చెక్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..? 
వేసవి రద్దీకి చెక్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..?

Special Trains : వేసవి రద్దీకి చెక్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని ముందుగానే అంచనా వేసిన రైల్వే శాఖ, దేశవ్యాప్తంగా పలు ముఖ్య మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ సర్వీసుల ప్రధాన ఉద్దేశ్యం ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడం, రద్దీని తగ్గించడం. విశాఖపట్నం నుంచి షాలిమార్ వరకు నడిచే వీక్లీ స్పెషల్ రైలు (08508, 08507) ఈ జాబితాలో ముఖ్యమైనది. ఈ రైలు ఏప్రిల్ 7 నుంచి జూన్ 30 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. విశాఖపట్నం నుంచి ఉదయం 11:20 గంటలకు బయలుదేరే ఈ రైలు విజయనగరం, శ్రీకాకుళం రోడ్, భువనేశ్వర్ వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతూ, మరుసటి రోజు తెల్లవారుజామున 03:00 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.

వివరాలు 

ప్రత్యేక రైలు సర్వీసులు 

తిరుగు ప్రయాణంలో ఈ రైలు షాలిమార్ నుంచి ప్రతి బుధవారం ఉదయం 05:00 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 08:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీసులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ తరగతుల కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక సంబల్‌పూర్ నుంచి ఈరోడ్ వరకు నడిచే వీక్లీ స్పెషల్ (08311, 08312) ఏప్రిల్ 1 నుంచి మొత్తం తొమ్మిది ట్రిప్పులు నిర్వహించనుంది. ప్రతి బుధవారం ఉదయం 11:35 గంటలకు సంబల్‌పూర్ నుంచి బయలుదేరి, దువ్వాడ మార్గంగా ప్రయాణిస్తూ, గురువారం రాత్రికి ఈరోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ఈరోడ్ నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 02:35 గంటలకు ప్రారంభమవుతుంది.

వివరాలు 

ప్రత్యేక రైలు సర్వీసులు

అదే విధంగా భువనేశ్వర్ నుంచి యశ్వంత్‌పూర్‌కు నడిచే వీక్లీ స్పెషల్(02811, 02812)ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమై మొత్తం 13ట్రిప్పులు నడుస్తుంది. పూర్తిగా థర్డ్ ఏసీ కోచ్‌లతో నడిచే ఈ రైలు ప్రతి శనివారం సాయంత్రం 07:15 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ నుంచి ప్రతి సోమవారం తెల్లవారుజామున 04:30 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. గుంటూరు,నంద్యాల వంటి కీలక స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.దూర ప్రయాణాల కోసం యశ్వంత్‌పూర్ నుంచి కటిహార్ వరకు ప్రత్యేక రైలు (06571, 06572) కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి మంగళవారం ఉదయం 07:00గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే ఈ రైలు విజయనగరం,మాల్దా టౌన్ మార్గంగా ప్రయాణించి గురువారం ఉదయం కటిహార్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం ప్రతి శుక్రవారం నిర్వహించబడుతుంది.

Advertisement

వివరాలు 

ప్రత్యేక రైలు సర్వీసులు

ఇక బెంగళూరు నుంచి మాల్దా టౌన్ వరకు నడిచే వీక్లీ స్పెషల్ రైళ్లు (06565, 06566) ఏప్రిల్ 5 నుంచి జూలై మధ్య వరకు కొనసాగుతాయి. బెంగళూరు నుంచి ఆదివారాల్లో రాత్రి 11:40 గంటలకు బయలుదేరే ఈ రైలు, మాల్దా టౌన్ నుంచి బుధవారాల్లో సాయంత్రం 04:00 గంటలకు ప్రారంభమవుతుంది. పలాస, బ్రహ్మపూర్ వంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. వేసవి కాలంలో సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇవి మంచి అవకాశంగా నిలుస్తాయి.

Advertisement