Page Loader
Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా 
Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా

Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రంకోర్టులో విచారణ.. 8వ తేదీకి వాయిదా 

వ్రాసిన వారు Stalin
Nov 28, 2023
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ.. ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఆ తేదీలోగా చంద్రబాబు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ చంద్రబాబుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి బయట మాట్లాడవద్దని చంద్రబాబుకు ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే చంద్రబాబు రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేసు గురించి చంద్రబాబు మాట్లాడొద్దు: సుప్రీంకోర్టు