Loading...
Remove Barricades Delhi: ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అవసరం లేని బారికేడ్లు తొలగించండి!
ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అవసరం లేని బారికేడ్లు తొలగించండి!

Remove Barricades Delhi: ఢిల్లీ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అవసరం లేని బారికేడ్లు తొలగించండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2026
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేత, సీజేపీ (Cockroach Janta Party - CJP) నిరసనల నేపథ్యంలో విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న బారికేడ్లను తొలగించాలని ఆదేశించింది. అత్యవసరంగా అవసరమైన చోట్ల మాత్రమే బారికేడ్లు కొనసాగించాలని స్పష్టం చేసింది. అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా నిషేధిస్తూ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 163 కింద విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని అధికారులకు సూచించింది. సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లోనూ సెక్షన్ 163 కింద నోటీసు జారీ చేసినట్లు తమకు సమాచారం అందిందని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనా ధర్మాసనం పేర్కొంది.

వివరాలు

ఆంక్షలను తొలగించాలి

సుప్రీంకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాలకు వెళ్లేందుకు, అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదని స్పష్టం చేసింది.

న్యాయాన్ని పొందేందుకు ప్రజలకు ఉన్న హక్కుకు ఆటంకం కలుగుతుందనే భయం కూడా ఉండకూడదని పేర్కొంది. అందువల్ల సంబంధిత ఆంక్షలను తొలగించాలని అధికారులను ఆదేశించింది.

సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రజల సాధారణ రాకపోకలను పునరుద్ధరించాలని ధర్మాసనం తెలిపింది.

అయితే శాంతిభద్రతలకు సంబంధించిన పరిస్థితులు తలెత్తినప్పుడు చట్టానికి అనుగుణంగా అవసరమైన నియంత్రణలు విధించవచ్చని పేర్కొంది.

వివరాలు

రాకపోకలను నిలిపివేయకూడదు

అంతకుముందు శుక్రవారం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 10న నిరసనల కారణంగా ఢిల్లీకి వచ్చే మెట్రో, రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది.

అన్ని రవాణా సేవలను పూర్తిగా స్తంభింపజేయడం సరికాదని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

కోర్టు ధిక్కరణగా పరిగణించాలి

అయితే, ఆదేశాలు ఉన్నప్పటికీ ఢిల్లీలో కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీనిపై పిటిషనర్, న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి అభ్యంతరం వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని కోరారు.

ఈ సందర్భంగా నిరసన తెలిపే హక్కుపై కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే అది పోలీసు చట్టం (Police Act) పరిధిలోనే జరగాలని స్పష్టం చేసింది.

నిరసనలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ వాటిని నిర్వహించే విధానం చట్టానికి అనుగుణంగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

సంబంధిత అధికారులకు నోటీసులు జారీ

జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి పిటిషనర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కు పోలీసు చట్టానికి అతీతమైనదని చెప్పలేరని స్పష్టం చేశారు. నిరసనల పేరుతో చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇదే సమయంలో నిరసనల సందర్భంగా జరిగిన అరెస్టులు, నిర్బంధాలు, వాటికి దారితీసిన పరిస్థితులపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)లకు నోటీసులు ఇచ్చింది.

నిరసనల సమయంలో తీసుకున్న చర్యలు, మెట్రో స్టేషన్ల మూసివేతకు సంబంధించిన పరిస్థితులపై అధికారుల వివరణను కోరింది.

ADVERTISEMENT