Sandeshkhali case: సందేశ్‌ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సందేశ్‌ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తుపై స్టే కోరుతూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కోల్‌కత్తా హైకోర్టు సందేశ్‌ఖలీ కేసు విచారణకు సీబీఐకి అప్పగించింది. దీంతో హైకోర్టు ఆదేశాలను మమత ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడు షాజన్హా షేక్‌ను ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేకపోయారని ప్రశ్నించింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారని బదులిచ్చారు.