Supreme Court: వైకాపాకు ఎదురుదెబ్బ.. నామినేషన్ల గడువు పెంపునకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల గడువు పొడిగించాలన్న వైకాపా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ పార్టీకి నిరాశ ఎదురైంది. ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశంతోనే గడువు పెంచాలని కోరుతున్నారని భావిస్తూ.. అలాంటి ప్రయత్నాలకు తాము లొంగబోమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలన్నింటినీ అమలు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది. నామినేషన్ల దాఖలుకు నిర్ణయించిన గడువు ఇప్పటికే ముగిసిన నేపథ్యంలో, తదుపరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని వైకాపాకు సూచిస్తూ.. ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్థానిక ఎన్నికల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
స్థానిక ఎన్నికల వ్యవహారంలో వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
— Telugu Stride (@TeluguStride) October 27, 2026
స్థానిక ఎన్నికల్లో నామినేషన్ గడువు పెంచాలన్న వైసీపీ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఎన్నికలు వాయిదా వేయాలన్న మీ ట్రాప్ పడబోమని వ్యాఖ్యానించిన సీజేఐ ధర్మాసనం.. స్థానిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ పిటిషన్‌పై… https://t.co/Njh1M9h1r8 pic.twitter.com/PuTkyQcUfU