
Supreme Court: 26 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
తనకు అనారోగ్యం కారణంగా 26 వారాలకు పైగా ఉన్న గర్భాన్ని తొలగించాలని కోరుతూ ఓ వివాహిత చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.
ప్రెగ్నెన్సీ వ్యవధి 24 వారాలు దాటినందున, ప్రెగ్నెన్సీని తొలగించడం న్యాయపరంగా అనుమతించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ప్రసవించడం వల్ల తల్లికి తక్షణ ముప్పు లేదని, ఈ కేసు పిండం అసాధారణతకు సంబంధించినది కాదని ధర్మాసనం చెప్పింది.
పుట్టబోయే బిడ్డలో ఎటువంటి లోపాలు లేవని, తల్లికి కూడా తగినస్థాయిలో మంచి చికిత్స అందిస్తే, ప్రసవానంతర సమస్యలు కూడా ఉండని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టు
రెండుసార్లు మెడికల్ రిపోర్టులు సమర్పించిన ఎయిమ్స్
పిండంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్‌ను సుప్రీంకోర్డు ఆదేశించింది. దీంతో ఎయిమ్స్ నివేదికను అందజేసింది.
ఈ కేసులో ఎయిమ్స్ సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వడం ఇది రెండోసారి.
27ఏళ్ల మహిళకు ఎయిమ్స్‌లో అబార్షన్ చేయడానికి అక్టోబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి, పిండం ఆరోగ్యం ఉందని, తల్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎయిమ్స్ చెప్పింది.
ఒక వేళ అబార్షన్ చేస్తే, ఒకరి ప్రాణం తీసినట్లు అవుతుందని తన రిపోర్డులో ఎయిమ్స్ వెల్లిడించింది.
ఈ క్రమంలో ఎయిమ్స్ రిపోర్టుపై విచారించిన ధర్మానసం, మరోసారి రిపోర్టును సమీక్షించాలని ఎయిమ్స్‌ను సుప్రీకోర్టు ఆదేశించింది.
ఎయిమ్స్ తాజాగా సమర్పించిన నివేదిక ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది.