Page Loader
Supreme Court : 'మేం జోక్యం చేసుకుంటాం'.. కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Feb 26, 2024
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)కి చెందిన మహిళా షార్ట్-సర్వీస్ కమిషన్ ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయకుంటే, తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రానికి ధర్మాసనం గట్టి వార్నింగ్ ఇచ్చారు. డిఫెన్స్ సర్వీస్‌లో లింగ సమానత్వం ఉండేలా తాము చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తదుపరి విచారణను సీజేఐ మార్చి 1కి వాయిదా వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రాన్ని హెచ్చరించిన సీజేఐ