Loading...
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో కీలక పరిణామం
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో కీలక పరిణామం

Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో కీలక పరిణామం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2026
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోదీని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ'చోర్‌ కీ సర్దార్‌'అంటూ వ్యాఖ్యానించడంపై ఓ భాజపా కార్యకర్త కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో మెజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ఉపశమనం లభించకపోవడంతో రాహుల్‌ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే,ఈ కేసును కొట్టివేయడం సాధ్యం కాదంటూ గత నెల 8న బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం,బాంబే హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. దీంతో ఈ పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట లభించినట్లయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాహుల్‌ గాంధీకి ఊరట

ADVERTISEMENT