Page Loader
బ్రిజ్ భూషణ్ సింగ్‌ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట
బ్రిజ్ భూషణ్ సింగ్‌ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట

బ్రిజ్ భూషణ్ సింగ్‌ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట

వ్రాసిన వారు Stalin
Jun 08, 2023
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదు చేసిన రెజ్లర్ మైనర్ కాదంటూ స్వయంగా ఆ అమ్మాయి తండ్రి వాంగ్మూలం ఇవ్వడంతో కేసు కీలకమలుపు తిరిగింది. బ్రిజ్ భూషణ్‌పై చేసిన లైంగిక వేధింపులపై ఆమె చేసిన ఫిర్యాదు అలాగే ఉంది. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపులతో పాటు పోక్సో చట్టం కింద మొత్తం రెండు కేసులను పోలీసులు ఏప్రిల్ 29న నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మైనర్ ఉండటం వల్ల పోక్సో కేసును నమోదు చేశారు. తాజాగా ఆ బాలిక మైనర్ కాదని, మేజర్ అంటూ స్వయంగా ఆమె తండ్రి స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

రెజ్లింగ్

బ్రిజ్ భూషణ్ సింగ్‌కు భారీ ఊరట

బ్రిజ్ భూషణ్‌పై ఉన్న పోక్సో కేసును ఉపసంహరించుకొని, ఆ బాలిక స్టేట్‌మెంట్‌ను మిగతా రెజ్లర్లు చేసిన ఫిర్యాదు జాబితాలో చేర్చే అవకాశం ఉంది. దీంతో భూషణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది. పోక్సో కింద నేరం రుజవైతే ఏడేళ్లు జైలుశిక్ష పడుతుంది. మహిళలను లైంగికంగా వేధించిన కేసులో నేరం రుజువైతే రెండేళ్ల జైలుశిక్ష పడుతుంది. కేసు సవరణ తర్వాత బ్రిజ్ భూషణ్‌పై ఉన్న రెండు కేసులు ఒకటికి తగ్గుతాయి. మొత్తం ఏడుగురు రెజర్లను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ భూషణ్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. జూన్ 15లోగా ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో బుధవారం జరిగిన చర్చల సందర్భంగా రెజ్లర్లు ఇదే డిమాండే చేశారు.