LOADING...
J&K: షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం
షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం

J&K: షోపియాన్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద నిర్మూలన చర్యలను భారత భద్రతా బలగాలు మరింత వేగవంతం చేస్తున్నాయి. షోపియాన్ జిల్లాలో గత ఐదు రోజులుగా కొనసాగిన హై-వోల్టేజ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా (LeT) సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టాప్ కమాండర్ జాకీర్ గనాయ్‌ను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చాయి. ఘటన అనంతరం అతడి మృతదేహాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

వివరాలు 

నిఘా కెమెరాల్లో చిక్కిన కదలికలు

ఈ ఆపరేషన్‌కు జులై 3న కీలక మలుపు తిరిగింది. షోపియాన్‌లోని తోటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల్లో జాకీర్ గనాయ్‌తో పాటు లతీఫ్ అనే మరో ఉగ్రవాది సంచారం రికార్డైంది. ఈ సమాచారం ఆధారంగా భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. ముందస్తు వ్యూహంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఉగ్రవాదుల కదలికలను నిలువరించేందుకు చర్యలు ప్రారంభించాయి.

వివరాలు 

విక్టర్ ఫోర్స్ మోహరింపు.. అన్ని మార్గాలు మూసివేత

దట్టమైన తోటల మధ్య నుంచి ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు భారత సైన్యానికి చెందిన ప్రత్యేక విభాగం 'విక్టర్ ఫోర్స్'ను రంగంలోకి దింపారు. ఉగ్రవాదులు బయటకు వెళ్లే అవకాశమున్న అన్ని మార్గాలను పూర్తిగా మూసివేశారు. రాత్రి వేళల్లో కూడా ఆపరేషన్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసి నిరంతర గాలింపు కొనసాగించారు.

Advertisement

వివరాలు 

ఎదురుకాల్పుల్లో జాకీర్ హతం

భద్రతా బలగాలు ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతానికి చేరువ కావడంతో వారు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. జవాన్లు వెంటనే ప్రతీకార కాల్పులు జరపడంతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతడితో కలిసి ఉన్న మరో ఉగ్రవాది లతీఫ్ కోసం భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. షోపియాన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద నెట్‌వర్క్‌కు ఈ ఎన్‌కౌంటర్ గట్టి ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement