ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు.. కారణమిదే?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను రావడంతో రఘవ్ చద్దాపై వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకు అతనిపై సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. అనుమతి లేకుండా దిల్లీ బిల్లు ప్రతిపాదిత కమిటీలో చేర్చారంటూ ఆ నలుగురు ఎంపీలు రాజ్యసభకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద రఘవ్ చద్దాపై చర్యలు తీసుకున్నారు. అయితే రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ వేటు వేయాలంటూ రాజ్యసభ పక్షనేత పీయూష్ గోయల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బీజేపీ కుట్ర
ఆ తీర్మానానికి అధికార పక్షం సభ్యులు మద్దతు పలకడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఆ తీర్మానానికి అధికార పక్షం సభ్యులు మద్దతు పలకడంతో అతడిని సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఈ ఫోర్జరీ ఆరోపణలపై అంతకుముందు రఘవ్ చద్దా స్పందించారు. కమిటీలో భాగం కావాలని ఆ నలుగురు ఎంపీలను కోరానని, ప్రస్తుతం భాజపా తనని టార్గెట్ చేసిందని, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాల చేస్తోందని ఆయన ఆరోపించారు. తర్వాత బిజూ జనతాదళ్, ఏఐఏడీఎంకే, భాజపాలకు చెందిన ఎంపీలు సస్మిత్ పాత్ర, తంబిదురై, ఫాంగ్‌నాన్ తాము సంతకాలు చేయలేదని స్పష్టం చేశారు.