Page Loader
Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి
Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి

Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి

వ్రాసిన వారు Stalin
May 15, 2024
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం..ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్‌ సుజాత(48)మంగళవారం అదృశ్యమైనట్లు సమాచారం. మంగళవారం పని నిమిత్తం కథాపురం వెళ్లిన ఆమె తిరిగి రాలేదని గ్రామస్తులు తెలిపారు.అయితే బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమీపంలోని అటవీప్రాంతంలో కూలీలు సుజాత మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా,ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసి హతమార్చినట్లుగా గుర్తించారు. అదేవిధంగా,సుజాత బంగారు చెవిపోగులు,ఫోన్ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు..