Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త
ఆప్ మాజీ రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు ప్రాణ హాని ఉందని ఆమె మాజీ భర్త నవీన్ జైహింద్ ఆరోపించారు. స్వాతిమలివాల్ గతంలో అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. స్వాతి మలివాల్ పై ఇటీవలే అనుచితమైన దాడి జరిగింది. దీని వెనుక కేజ్రీవాల్ ప్రస్తుత వ్యక్తిగత కార్యదర్శి బైబవ్ కుమార్ ప్రమేయం వుండవచ్చని ఆమె అనుమానిస్తున్నారు. దీనిని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ధృవీకరించారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని దోషిపై కఠిన చర్య తీసుకుంటారన్నారు. మరో వైపు ఇదంతా సంజయ్ సింగ్ కు తెలిసే జరుగుతుందని స్వాతి మాజీ భర్త నవీన్ ఫేస్ బుక్ వీడియోలో ఆరోపించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నవీన్ జైహింద్ హర్యానా రాష్ట్రానికి ఆప్ కన్వీనర్
జైలు నుంచి బయటికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ను కలవటానికి స్వాతి సోమవారం ఆయన క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. అక్కడ ఆమెతో బైబవ్ కుమార్ అనుచితంగా వ్యవహరించారు .ఈ విషయమై స్వాతి ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. హర్యానా రాష్ట్రానికి 2019 ఎన్నికలు ముగిసే వరకు అంటే 2020 వరకు నవీన్ జైహింద్ హర్యానా రాష్ట్రానికి ఆప్ కు కన్వీనర్ గా ఉన్నారు. ఆ సమంలో స్వాతి,నవీన్ జైహింద్ ఇష్టపడి వివాహం చేసుకున్నారు. అయితే మూడేళ్లకే వారిద్దరూ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇందుకు కారణం నవీన్ తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అటువంటిదేమీ జరగలేదని నవీన్ జైహింద్ చెప్పుకొచ్చారు. కావాలనే స్వాతి తమ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.