
Amaravati: రాష్ట్రంలో తనేజా ఏరోస్పేస్ పెట్టుబడులు.. మంత్రి జనార్దన్‌రెడ్డి వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సంస్థ తనేజా ఏరోస్పేస్ రాష్ట్రానికి తెలియజేసిందని,రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఇది ముఖ్యమైన ముందడుగుగా మారనుందని పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం విజయవాడలో ఈ సంస్థ ప్రతినిధులు మంత్రి జనార్దన్‌రెడ్డిని కలిసి తమ ప్రాజెక్టు లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళికలను వివరించారు.
వివరాలు
రాష్ట్రంలో 12 సీట్లు కలిగిన ప్రైవేట్ జెట్ విమానాల తయారీ యూనిట్
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,"తనేజా ఏరోస్పేస్ సంస్థ రాష్ట్రానికి పెట్టుబడులతో రావడం ఎంతో ఆనందదాయకం. ఇది పరిశ్రమల అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుంది. ఈ సంస్థ రాష్ట్రంలో 12 సీట్లు కలిగిన ప్రైవేట్ జెట్ విమానాల తయారీ యూనిట్‌ను, అలాగే టాల్ టేల్ అనే విమాన సాఫ్ట్‌వేర్ కంపెనీని ఏర్పాటు చేయాలని సంకల్పించింది" అని తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించిందని ఆయన చెప్పారు. ఉద్యోగాల సృష్టిని కేంద్రంగా చేసుకొని ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఈ పాలసీలో ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.