తదుపరి వార్తా కథనం

DCP RadhaKishan: టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్ పొడిగింపు
వ్రాసిన వారు
Stalin
Apr 10, 2024
02:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.
కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను నాంపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచారు.
న్యాయస్థానం రాధా కిషన్ రిమాండ్ ను ఈనెల 12 వరకు పొడిగించింది.
విచారణ సందర్భంగా జైలులో తనను లైబ్రరీకి వెళ్లేందుకు, జైలు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అనుమతించడం లేదని కోర్టు చెప్పారు.
దీంతో లైబ్రరీలోకి అనుమతించడంతోపాటు సూపరింటెండెంట్ ను కూడా కలిసేందుకు అవకాశం కల్పిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
కోర్టుకు తీసుకొచ్చేముందు రాధా కిషన్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
కోర్టు రిమాండ్ ను పొడిగించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. ఈ కేసులో పీపీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.