Loading...
Badvel Municipality: బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి ఆధిపత్యం.. 40 వార్డులూ కైవసం
బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి ఆధిపత్యం.. 40 వార్డులూ కైవసం

Badvel Municipality: బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి ఆధిపత్యం.. 40 వార్డులూ కైవసం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కడప జిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీని పూర్తిస్థాయిలో కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన ఓట్ల లెక్కింపులో పోలింగ్ నిర్వహించిన ఏకైక వార్డులోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో కూటమి క్లీన్‌స్వీప్‌ పూర్తి చేసింది. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 39వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తుడిమెళ్ల విజయ 372 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 40 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో కేవలం 39వ వార్డుకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 39 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

వివరాలు 

ఇప్పటికే చైర్‌పర్సన్‌తో పాటు 39 వార్డులు ఏకగ్రీవం

ఎన్నికలకు ముందే బద్వేలు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి సోమేశుల దివ్య తేజ ఏకగ్రీవంగా దక్కించుకున్నారు.

ఏకగ్రీవమైన 39 వార్డుల్లో టీడీపీ 35 స్థానాలను గెలుచుకోగా, జనసేనకు రెండు స్థానాలు దక్కాయి. మరో రెండు వార్డులను స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

తాజాగా 39వ వార్డులోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో బద్వేలు మున్సిపల్ కౌన్సిల్‌పై కూటమి సంపూర్ణ ఆధిపత్యం సాధించినట్లయింది.

ఈ విజయంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ADVERTISEMENT