Loading...
Pulivendula: పులివెందులలో కూటమి ప్రభంజనం.. జగన్‌ కంచుకోటలో టీడీపీ పాగా
పులివెందులలో కూటమి ప్రభంజనం.. జగన్‌ కంచుకోటలో టీడీపీ పాగా

Pulivendula: పులివెందులలో కూటమి ప్రభంజనం.. జగన్‌ కంచుకోటలో టీడీపీ పాగా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ కంచుకోటగా భావించే ఈ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. నియోజకవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 64 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 7 జడ్పీటీసీ స్థానాలకు గాను 3 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఒకే అభ్యర్థి నామినేషన్‌ మిగిలిన స్థానాల్లో వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వివరాలు 

ఏకగ్రీవంగా ఎన్నికైనా స్థానాలు ఇవే..

వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

వీటిలో టీడీపీ అభ్యర్థులు 15 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఒక్కో స్థానంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దీంతో వేంపల్లి మండలంలోని అల్లిరెడ్డిపల్లె ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది.

పులివెందుల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలకూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వేముల మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులే దక్కించుకున్నారు.

చక్రాయపేట మండలంలోని 9 ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

తొండూరు మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలు, సింహాద్రిపురం మండలంలో మరో 8 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.

ADVERTISEMENT