Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడడం వలన నిత్యం రద్దీగా ఉండే రైళ్ల సేవలు అరగంట పాటు నిలిచిపోయాయి. నాగోల్, రాయదుర్గం, మియాపూర్, ఎల్బీనగర్ స్టేషన్లలో మెట్రో సేవలు సేవలకు అంతరాయం కలిగింది. బేగంపేట మెట్రో స్టేషన్‌లో అధికారులు 15 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. ఈ సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం, ఉదయం 10 గంటల నుంచి సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఆగిపోయాయి, దీంతో ప్రయాణికులలో భయాందోళన కలిగించాయి. మెట్రో యాజమాన్యం త్వరలో సాధారణ రాకపోకలు తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది, కానీ సమస్యకు సంబంధించిన కారణాలు ఇంకా వెల్లడించలేదు.
ప్రయాణికులు ఆగ్రహం
పలు మెట్రో రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం వలన ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరడంతో, అందుకు సంబంధించి రద్దీ పెరిగింది. కొందరు ప్రయాణికులను స్టేషన్ లోపలికి అనుమతించకుండా, సాంకేతిక లోపం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 30 నిమిషాలు గడిచినా మెట్రో రైళ్లు కదలడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. అయితే, అధికారులు ప్రస్తుతం సమస్యను పరిష్కరించడంపై కృషి చేస్తూ, కొంత సమయం అవసరమని చెప్పారు.