తదుపరి వార్తా కథనం
Tejasvi Surya: పెళ్లి పీటలు ఎక్కనున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.. వధువు ఎవరేంటే?
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 01, 2025
09:09 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు.
రెండోసారి బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు.
ఈ వివరాలను తేజస్వి స్వయంగా మంగళవారం బెంగళూరులో ప్రకటించారు.
మార్చి 24వ తేదీన వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు.
శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ పూర్తి చేయగా, మద్రాస్ సంస్కృత కళాశాల నుండి సంస్కృతంలో కూడా ఎంఏ పూర్తి చేశారు.