Page Loader
TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం 
నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం

TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 30, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు బుధవారం నాడు ప్రకటించనున్నారు. రవీంద్రభారతిలో బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఏ.కృష్ణారావు తెలిపారు. ఈసారి పరీక్షల ఫలితాల్లో ఓ ప్రత్యేక మార్పు జరిగింది.ఇప్పటివరకు అమలులో ఉన్న గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) విధానాన్ని పూర్తిగా తొలగించారు. దాంతోపాటు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన మార్కులను గ్రేడ్‌ల రూపంలో స్పష్టంగా చూపించనున్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా పాస్ లేదా ఫెయిల్ అని నిర్ణయిస్తారు. ఇది ఆయా అభ్యర్థుల మార్కుల మెమోలో స్పష్టంగా పేర్కొనబడుతుంది.

వివరాలు 

ఈ వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు పరిశీలించవచ్చు

ఫలితాలను తెలుసుకోవాలనుకునే వారు ఈ క్రింది వెబ్‌సైట్ల ద్వారా తన స్కూల్ కోడ్ లేదా హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలు పరిశీలించవచ్చు: https://www.results.bsetelangana.org https://results.bse.telangana.gov.in గమనిక: మొత్తం పరీక్షలన్నింటికీ కలిపి 600 మార్కులు ఉండేలా విధానం ఉంది. ప్రతి సబ్జెక్టుకు రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ అసెస్మెంట్‌కు 20 మార్కులు కలిపి 100 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో హిందీ సబ్జెక్టులో కనీసం 16 మార్కులు (పాస్ మార్క్‌ 20) రావాలి. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కనీసం 28 మార్కులు (పాస్ మార్క్‌ 35) రాబడితే ఆ విద్యార్థిని పాసైనట్టుగా పరిగణిస్తారు.