
Telangana Result: తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. 15 నిమిషాలకు ఒక రౌండ్ లెక్కింపు
ఈ వార్తాకథనం ఏంటి
Telangana Assembly Election Result 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
ఆదివారం ఉదయం 8గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు షురూ అయ్యింది. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు.
119 నియోజకవర్గాల్లో 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రతి 15 నిమిషాలకు ఒక రౌండ్ చొప్పున కౌంటింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.
పోస్టల్ బ్యాలెట్లు ఈసారి ఎక్కువ పోల్ అవడంతో.. వాటి లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఉదయం 9గంటలకు ఈవీఎంలను లెక్కింపును చేపట్టనున్నారు.
అన్ని నియోజకవర్గాలకు కలిపి 1798 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 2417 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లెక్కింపు షురూ
Counting of votes for Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana Assembly elections begins. pic.twitter.com/Raj87zBuaI
— ANI (@ANI) December 3, 2023