Page Loader
TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్ 
తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్

TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్ 

వ్రాసిన వారు Stalin
Aug 30, 2023
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలను మరింత పెంచేందుకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులు నిర్వాహకులకు ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చింది. మద్యాన్ని అప్పు ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం షాపుల యజమానులు ఎంత చలానా కడుతారో, దానికి అదనంగా 50శాతం విలువైన మద్యాన్ని అప్పుగా ఇచ్చేందుకు సిద్ధమైంది. మద్యం షాపుల నిర్వాహకులు రూ.లక్ష విలువైన చలానా, దానికి మరో రూ.50 వేల విలువైన మద్యాన్ని అప్పుగా ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మద్యం డిపోలకు బెవరేజెస్ కార్పొరేషన్ జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తర్వులు జారీ చేసిన బెవరేజెస్ కార్పొరేషన్