LOADING...
Telangana Budget : తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

Telangana Budget : తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో జన్మించి, ఇక్కడే జీవించడం ఒక ప్రత్యేక అనుభూతిగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడమే కాకుండా, ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ భద్రతే ప్రభుత్వ లక్ష్యం ఒక కుటుంబంలో ఆదాయం తీసుకొచ్చే వ్యక్తి అకస్మాత్తుగా మృతిచెందితే ఆ కుటుంబం తీవ్ర మానసిక వేదనతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుందని భట్టి పేర్కొన్నారు. ఒకే ఘటనతో కుటుంబం పూర్తిగా సంక్షోభంలో పడే పరిస్థితులు వస్తాయని అన్నారు. అలాంటి అనిశ్చితి, భయం తెలంగాణ ప్రజలకు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

వివరాలు 

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా

ఈ బడ్జెట్‌లో భాగంగా దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అరుదైన జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఆర్థిక మంత్రి భట్టి వెల్లడించారు. సామాజిక, ఆర్థిక భేదాలు లేకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించేందుకు "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం"ను 2026 జూన్ 2 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య సమతుల్య బడ్జెట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ప్రజలపై అదనపు భారాన్ని మోపకుండా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో కొనసాగించేలా ఈ బడ్జెట్ రూపొందించామని చెప్పారు.

వివరాలు 

యువతకు ప్రోత్సాహం - భారీ నిధులు

ఇందులో గృహనిర్మాణం, నీటిపారుదల, సామాజిక న్యాయం, మౌలిక వసతులు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా యువత, విద్య, కుటుంబ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. వివిధ వర్గాల యువతలో స్వయం ఉపాధిని పెంపొందించేందుకు "రాజీవ్ యువ వికాసం" పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు ఇతర వర్గాల యువతకు ఆర్థిక సహాయం అందించనుంది.

Advertisement

వివరాలు 

విద్య రంగానికి ప్రాధాన్యత

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడంతో పాటు, హాస్టళ్ల వంటశాలల ఆధునీకరణకు రూ.100 కోట్లు కేటాయించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి రూ.1,000 కోట్లతో మౌలిక సదుపాయాల బలోపేతానికి చర్యలు చేపట్టనున్నారు. పర్యాటకం, పరిశ్రమలకు ప్రోత్సాహం గోదావరి పుష్కరాలు-2027 కోసం రూ.500 కోట్లు, పర్యాటక రంగ అభివృద్ధికి రూ.1,224 కోట్లు, పరిశ్రమలకు రూ.3,490 కోట్లు కేటాయించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మహిళా, శిశు సంక్షేమానికి రూ.3,143 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

వివరాలు 

విద్యార్థులకు ఉపకార వేతనాలు

ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. విద్యార్థులందరికి బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ పథకం 2026-27 విద్యా సంవత్సరంలో అమలు చేయనుంది. అదనంగా, దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement