Page Loader
తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?
అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ బడ్జెట్: ఎన్నికల ఏడాదిలో ఎలా ఉండబోతోంది?

వ్రాసిన వారు Stalin
Feb 06, 2023
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. కేసీఆర్ రెండో దఫా ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా కనిపిస్తోంది. గతేడాది రూ.2.56లక్షల కోట్ల బడ్జెట్‌ను హరీశ్ రావు ప్రవేశ పెట్టగా, ఈ సారి అది రూ.3లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇందులో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిపక్షాలు నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.

అసెంబ్లీ

రాష్ట్ర ప్రజలు ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం ఉంటుందని అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామికి ఆర్థికమంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాకపోయినప్పటికీ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి సమర్పించనున్నారు.