NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్
    ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్

    తెలంగాణ అసెంబ్లీ: ప్రభుత్వంపై అక్బరుద్దీన్ విమర్శలు, మంత్రి కేటీఆర్ కౌంటర్

    వ్రాసిన వారు Stalin
    Feb 04, 2023
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ అసెంబ్లీలో ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. హైదరాబద్ అభివృద్ధి, ప్రభుత్వం పనితీరుపై అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

    ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానికి తగిన న్యాయం చేయడం లేదని అక్బరుద్దీన్ విమర్శించారు. సచివాలయంలో మసీదు నిర్మాణం పరిస్థితి, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

    హైటెక్ సిటీలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నా పాతబస్తీలో మాత్రం అభివృద్ధి జరగకపోవడంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

    కేటీఆర్

    బీఏసీ సమావేశానికి హాజరుకాకుండా మాట్లాడడం సరికాదు: మంత్రి కేటీఆర్

    తాము కలవడానికి సీఎం కేసీఆర్, మంత్రులు అనుమతివ్వడం లేదని అక్బరుద్దీన్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చెప్పరాశిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

    ఏఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపణలకు మంత్రి కేటీఆర్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీఏసీ సమావేశానికి హాజరుకాకుండా మాట్లాడడం సరికాదని మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు.

    కేవలం ఏడుగురు సభ్యులతో కూడిన ఎంఐఎం సెషన్‌లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందని అభ్యంతరం తెలిపారు. సభలో నిబంధనలను పాటించాలని సూచించారు.

    అనంతరం స్పందించిన ఓవైసీ, వచ్చే ఎన్నికల్లో 50స్థానాల్లో పోట చేస్తామని ప్రకటించారు. తాను చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, సభలోని నిబంధనల గురించి తనకు తెలుసునన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    తాజా

    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా
    Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు తెలంగాణ

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌

    తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై గవర్నర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025