LOADING...
Bomb Threat: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపులు..
తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపులు..

Bomb Threat: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో), లోక్ భవన్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. ఈ ప్రదేశాల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఆగంతకుడు మెయిల్ ద్వారా హెచ్చరించడంతో అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. గవర్నర్ కార్యాలయానికీ ఇదే తరహా బెదిరింపు మెయిల్ అందడంతో భద్రతా సిబ్బంది అధిక జాగ్రత్తలు తీసుకున్నారు. వాసుకి ఖాన్ పేరుతో వచ్చిన ఈ మెయిల్‌లో, వీఐపీలు, ప్రముఖులను వెంటనే భవనం నుంచి ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై గవర్నర్ కార్యాలయం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ మెయిల్ మూలాలు, పంపిన వ్యక్తి వివరాలపై విచారణ కొనసాగుతోంది.

వివరాలు 

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు

ఇదిలా ఉండగా, శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేగింది. అమెరికా నుంచి ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనం కలిగించింది. న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి ఈ మెయిల్ పంపినట్లు అధికారులు గుర్తించారు. శంషాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో బాంబు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో పేలుస్తామని మెయిల్‌లో పేర్కొన్నాడు. దాడిని నిలిపివేయాలంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ సమాచారంతో ఎయిర్‌పోర్టు అధికారులు అత్యంత అప్రమత్తమై, విమానాశ్రయ పరిసరాలన్నింటిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Advertisement