LOADING...
Telangana: వాన నీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం.. కేంద్ర 'జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ'లో ఎంపిక 
కేంద్ర 'జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ'లో ఎంపిక

Telangana: వాన నీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం.. కేంద్ర 'జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ'లో ఎంపిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించిన "జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారీ 1.0" ర్యాంకింగ్స్‌ ప్రకారం,తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ తరువాత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ వరుసగా ·రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా వర్షపు నీటిని సురక్షితంగా నిల్వ చేసుకోవడం,వృథా నీటిని తగ్గించడం,నీటి వనరులను కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబరు నుండి ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నీటి వనరుల నిర్వహణలో ప్రజలు,స్థానిక సంస్థలు,పరిశ్రమలు,ఇతర భాగస్వాములను కలిపి పనులు చేపట్టడం లక్ష్యంగా ఉంది. అందులో చెక్‌డ్యామ్‌లు,ఇంకుడు గుంతలు,రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్ సౌకర్యాలు,పొలాల్లో నీటి గుళికలు,ఊట చెరువులు వంటి వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ముఖ్యంగా ఉన్నాయి.

వివరాలు 

దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపిక 

2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,20,362 వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు పూర్తి చేయబడ్డాయి. ఈ పనుల్లో ఉపాధి హామీ పథకాలు, జాతర కార్యక్రమాలు మొదలైన వాటికి ప్రాధాన్యత కల్పించడం తెలంగాణకు కేంద్ర ర్యాంకుల్లో మొదటి స్థానాన్ని అందించడంలో ముఖ్య కారణం. అదేవిధంగా, జల్‌ సంచయ్‌-జన్‌ భాగీదారీ 1.0లో దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపిక అయ్యాయి. తెలంగాణలోని 8 జిల్లాలు ప్రత్యేక గుర్తింపునిచ్చే క్షేత్రంలో నిలిచాయి.

వివరాలు 

8 జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు 

వాటి వివరాలు ఇలా ఉన్నాయి: రూ. 2 కోట్ల నగదు బహుమతి విభాగం: ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల రూ. 1 కోటి నగదు బహుమతి విభాగం: వరంగల్, నిర్మల్, జనగామ రూ. 25 లక్షల నగదు బహుమతి విభాగం: భద్రాద్రి, మహబూబ్‌నగర్‌ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వర్షపు నీటిని సమర్థవంతంగా సంరక్షించడం, వృథా నీటిని తగ్గించడం, నీటి వనరులను పరిరక్షించడంలో దేశానికి మోడల్‌గా నిలిచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

IPR డిపార్ట్మెంట్ చేసిన ట్వీట్