Page Loader
Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా
ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా

Voter Slip :ఓటర్ స్లిప్ కావాలా..ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 27, 2023
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్' కోసం దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 25 (శనివారం)తో పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ స్లిప్పులు అందజేశారని వెల్లడించింది.ఇదే సమయంలో పలువురికి అనివార్య కారణాలతో స్లిప్పులు అందించలేకపోయామని పేర్కొంది. దీంతో ఓటర్ స్లిప్పులు అందని వారికి మరో అవకాశముందని స్పష్టం చేసింది.ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటర్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచనలు చేసింది. ఓటర్ స్లిప్ అంటే : ఓటు హక్కు ఉందా లేదా అనే ప్రాథమిక విషయం తెలుస్తుంది.మరోవైపు ఏ పోలింగ్ బూత్'లో ఓటేయాలనే వివరాలు సదరు స్లిప్పులోనే నిక్షిప్తమై ఉంటాయి.

details

నేరుగా ఆన్ లైన్'లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశం

ఓటరు స్లిప్'తో వ్యక్తిగత గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లి ఓటేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా స్లిప్ అందని వారు నేరుగా ఆన్ లైన్'లో డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి : https://ceotelangana.nic.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన సమాచారం ఫీడ్ చేస్తే ఓటరు వివరాలు, సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ కేంద్రం, పోలింగ్‌ సమయం, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ తదితర వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ సహాయంతో స్లిప్పును పొందొచ్చు. ఈ స్లిప్‌ను ప్రింట్ తీసుకుని పోలింగ్ బూత్ కు వెళ్లి నిరభ్యంతరంగా ఓటేయవచ్చు. మరోవైపు Voter Helplineలో 'ఓటర్‌ హెల్ప్‌లైన్‌'యాప్‌లోనూ ఓటర్‌ స్లిప్‌ పొందవచ్చు.