
Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్తను అందించనుంది.
'రైతు భరోసా' పథకంలోని నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయడాన్ని లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
నాలుగు ఎకరాల నుండి పది ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మే నెలాఖరులోగా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.
వివరాలు
నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే పంపిణీ
రైతుభరోసా పథకానికి అనుగుణంగా, ప్రతి పంట సీజన్‌కు ఎకరాకురూ.6,000 చొప్పున,సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపిరూ.12,000 ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.
ఈఏడాది జనవరి 26న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఫిబ్రవరి 5, 11 తేదీల్లో రెండు విడతల్లో నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను జమ చేశారు.
మిగిలిన రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు
నాలుగు ఎకరాలకు మించి భూమి కలిగిన రైతులకు ఇప్పటి వరకు ఈ పథకంలోని సాయం అందలేదు.
ఈనేపథ్యంలో,వారి ఖాతాల్లో పెట్టుబడి సాయంగా'రైతు భరోసా' నిధులను మే చివరి వారంలోగా జమ చేయాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధమవుతోంది.
వివరాలు
రాబోయే వారంలో సమీక్ష
రైతు భరోసా నిధుల చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి రాబోయే వారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం పెండింగ్‌లో ఉన్న చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సీజన్‌కు రూ.6,000 చొప్పున..
రైతు భరోసా కింద ప్రభుత్వం ఒక సీజన్‌కు ఒక్కో ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు అందిస్తోంది. గత రబీ సీజన్‌లో కూడా ఇదే విధంగా నాలుగు ఎకరాల లోపు రైతులకు మూడు దశల్లో నిధులు పంపిణీ చేశారు.
వివరాలు
35 లక్షల మంది రైతులు లబ్ధిదారులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎకరాలకు మించిన భూమిని కలిగి ఉన్న రైతుల సంఖ్య సుమారు 35 లక్షలుగా ప్రభుత్వం అంచనా వేసింది.
రబీ సీజన్ నిధులు ఇంకా అందని ఈ రైతులు ప్రస్తుతం రైతు భరోసా సాయంకోసం వేచి చూస్తున్నారు.
మే నెలాఖరులోగా వీరి ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
జూలై నుంచి ఖరీఫ్ నిధులు
జూన్ నెలలో ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభమవుతుంది.
అందువల్ల రబీ చెల్లింపులను జూన్ లోపల పూర్తి చేసి, జూలై నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు త్వరలో సీఎం అధికారులతో సమావేశం నిర్వహించి తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.