LOADING...
Kurnool Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Kurnool Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలు శివారు ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఘటనలో మరణించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరి ట్రావెల్స్ బస్సు, శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి-44పై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో పలువురు ప్రయాణికులు బస్సులోనే కాలిపోయి మృతి చెందగా,మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో సుమారు 39 మంది ఉన్నారు. వీరిలో 20 మంది మృతి చెందారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం