LOADING...
Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు 
బిల్లుల చెల్లింపుల్లో మార్పులు

Indiramma houses : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్.. బిల్లుల చెల్లింపుల్లో మార్పులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రభుత్వం "ఇందిరమ్మ ఇళ్ల పథకం"కింద గృహనిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తోంది. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500ఇండ్ల కేటాయింపు జరిగి,నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గృహనిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం విడతలవారీగా నిధులు జమ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తం నాలుగు విడతల్లో జమ అవుతుంది. అయితే తాజాగా ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసింది.

వివరాలు 

నాలుగు విడతల చెల్లింపు విధానంలో మార్పులు

ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటిశ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం,ఇప్పటివరకు అమలులో ఉన్న నాలుగు విడతల చెల్లింపు విధానంలో మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS) కింద 90రోజుల పనులు,అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఉపాధి హామీ పథకం ద్వారా లభిస్తున్న నిధులను పరిగణనలోకి తీసుకుని,రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథక చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటి వరకు బేస్‌మెంట్ దశ పూర్తి చేసిన తర్వాత రూ.1లక్ష,రూఫ్ లెవల్ వరకు నిర్మించిన తర్వాత మరో రూ.1లక్షను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి ఉంది.

వివరాలు 

రూ.60 వేలు కోత

రూఫ్ పూర్తయిన తరువాత మూడవ విడతగా రూ.2 లక్షలు చెల్లించేవారు. అయితే, ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా లభించే మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ చేయడం జరుగుతుంది. అందువల్ల, రూఫ్ పూర్తి చేసిన తర్వాత చెల్లించే మొత్తాన్ని రూ.2 లక్షల బదులుగా రూ.1.40 లక్షలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, ఇకపై శ్లాబ్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు రూ.1.40 లక్షలు మాత్రమే అందుతాయి. మిగిలిన రూ.60 వేలు కోతకు గురవుతాయి.ఈ కోత అయిన మొత్తంలో రూ.1 లక్షను ఇల్లు పూర్తిగా నిర్మాణం పూర్తైన తరువాత మాత్రమే విడుదల చేస్తారు.