
తెలంగాణలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు శుభవార్త: ఇకపై ఏసీ హెల్మెట్ లు రాబోతున్నాయ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనను అమల్లోకి తీసుకొస్తుంది. ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు ఏసీ హెల్మెట్లను అందివ్వనుంది.
అవును, ట్రాఫిక్ కానిస్టేబుళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ హెల్మెట్లను కొద్దిమందికి మాత్రమే ఇచ్చారు.
రాచకొండ పరిధిలో ఎల్ బీ నగర్ ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు ఏసీ హెల్మెట్లు అందించారు. ముందుగా వాటి పనితీరు ఎలా ఉందీ తదితర విషయాలపై విస్తృతంగా అధ్యయనం చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అందరికీ హెల్మెట్లు అందించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
Details
బ్యాటరీ ద్వారా పనిచేసే హెల్మెట్
ఈ హెల్మెట్లకు మూడు వైపుల నుండి రంధ్రాలు ఉంటాయి. ముందుభాగంలో, హెల్మెట్ లోపలి భాగంలో, వెనక భాగంలో ఉండే రంధ్రాల్లోంచి చల్లని గాలి వస్తుంటుందట.
ఇది బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. మూడుగంటల పాటు ఈ హెల్మెట్ ని ఉపయోగించాలంటే కనీసం అరగంట ఛార్జ్ చేయాల్సి ఉంటుందట.
ఎండలో గంటలు గంటలు నిలబడి పనిచేసే ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకు గతంలో కూలింగ్ గ్లాసెస్ అందించింది ప్రభుత్వం. ఇప్పుడు, ఏసీ హెల్మెట్లు అందించడానికి రెడీ అవుతోంది.