Page Loader
Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్ 
Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్

Telangana: కీలక నేతలను సలహాదారులుగా నియమించిన తెలంగాణ సర్కార్ 

వ్రాసిన వారు Stalin
Jan 21, 2024
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం నలుగురు కీలక నేతలను కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా తెలంగాణ శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి (ప్రజా వ్యవహారాల) సలహాదారుగా వేం నరేందర్ రెడ్డిని నియమించగా, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిగా డాక్టర్ మల్లు రవిని నియమించారు. హర్కర వేణుగోపాలరావుకు ప్రోటోకాల్, ప్రజా సంబంధాల కోసం ప్రభుత్వ సలహాదారు బాధ్యతలను అప్పగించారు. రేవంత్ రెడ్డి.. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత.. మరిన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి