LOADING...
Telangana: ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీ తగ్గించిన తెలంగాణ సర్కార్ 
Telangana: ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీ తగ్గించిన తెలంగాణ సర్కార్

Telangana: ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీ తగ్గించిన తెలంగాణ సర్కార్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Warangal Super Specialty Hospital),టిమ్స్ (TIMS) నిర్మాణ ఖర్చులను రూ.1,715 కోట్లు తగ్గించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మునుపటి బీఆర్‌ఎస్ సర్కార్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ నిర్మాణ వ్యయాలను అతి ఎక్కువగా పెంచారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. మొదట అధికారులు రూ.3,779 కోట్ల వ్యయం ఖర్చవుతుందని అంచనా వేసి, 2021లో జీవోలు జారీ చేశారు. కాగా, రెండేళ్లలో నిర్మాణ వ్యయాన్ని కేసీఆర్ సర్కార్ రూ.6,714 కోట్లకు పెంచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యయం పెంపుపై విచారణకు ఆదేశించారు.

వివరాలు 

నిర్మాణ ఖర్చు రూ.5,001 కోట్లకు పరిమితం

ఎంక్వైరీ కమిటీ తన నివేదికలో, నిర్మాణ వ్యయం పెంపులో నిబంధనలు ఉల్లంఘించబడినట్లు గుర్తించింది. అలాగే, కొంతమంది కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు వ్యయాన్ని అధికంగా చూపించినట్టు కనుగొన్నారు. తీర్మానంగా, ప్రభుత్వమా రూ.6,714 కోట్ల నిర్మాణ ఖర్చును తగ్గించి, రూ.5,001 కోట్లకు పరిమితం చేసింది. ఈ సవరిస్తున్న వ్యయాలను నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందాయి.