LOADING...
Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు
ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు

Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయాన్ని ప్రకటించింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ పరిధిని అనుసరించి పోలీసు కమిషనరేట్లను కూడా కొత్తగా మలిచింది. ఇప్పటివరకు కొనసాగుతున్న మూడు కమిషనరేట్ల స్థానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ అనే నాలుగు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు,నియామకాలపై సోమవారం రాత్రి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు సుధీర్ బాబును కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు. మల్కాజిగిరి కమిషనరేట్ బాధ్యతలను అవినాశ్ మహంతికి అప్పగించగా, సైబరాబాద్ కమిషనరేట్‌కు రమేశ్ రెడ్డిని సీపీగా ప్రభుత్వం నియమించింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా ఆకాంక్ష యాదవ్‌ను నియమిస్తూ కూడా ఉత్తర్వులు వెలువడ్డాయి.

వివరాలు 

మల్కాజిగిరి పేరుతో కొత్త కమిషనరేట్

ఇప్పటివరకు ఉన్న రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ను పునర్వ్యవస్థీకరించి మల్కాజిగిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఉండనున్నాయి. మరోవైపు రాచకొండ పరిధిలో భాగంగా ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా మార్చి, యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేకంగా ఎస్పీని ప్రభుత్వం నియమించింది. కొత్తగా నిర్ణయించిన కమిషనరేట్‌ల పరిధులు ఇలా ఉన్నాయి:- హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసెంబ్లీ, సచివాలయం, బేగంపేట, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలక ప్రాంతాలు ఉన్నాయి.

వివరాలు 

కొత్తగా నిర్ణయించిన కమిషనరేట్‌ల పరిధులు ఇలా ఉన్నాయి:-

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్ వంటి ఐటీ, పారిశ్రామిక ప్రాంతాలు చేరాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఉంటాయి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాలు ఉండనున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణతో నగర పరిధుల్లో పోలీసింగ్ మరింత సమర్థవంతంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement