Telangana IAS Transfers: తెలంగాణలో 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో ఆయన గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్‌గా కూడా కొనసాగుతారు. పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్యకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
వివరాలు
ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవి
ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సందీప్‌కుమార్ సుల్తానియా ఇకపై అదనపు బాధ్యతలను కూడా నిర్వహించనున్నారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవిని బదిలీ చేశారు. అంతేకాక రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు కేటాయించారు. జలమండలి జేఎండీగా మయాంక్ మిట్టల్‌ను నియమించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్‌డీగా అదనపు బాధ్యతలతోనే కొనసాగనున్నారు.