
Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది.
బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన అన్ని కేసులను ఇకపై సీఐడీ విచారణ జరిపించనుంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసులు నమోదయ్యాయి.
సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి.
అగ్రహీరోల నుంచి యూట్యూబర్ల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు.
అంతేకాదు, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొన్ని సినీ ప్రముఖులను విచారణకు కూడా పిలిచారు.
వివరాలు
రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం
బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు సెలెబ్రిటీలను ఇప్పటికే విచారిస్తున్నారు.బుల్లితెర నటి రీతూ చౌదరి,యాంకర్ విష్ణు ప్రియా,యాంకర్ శ్యామల పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు.
మియాపూర్ పోలీసులు ఎవరెవరు ఏ యాప్స్‌కు ప్రచారం చేశారో కనుగొన్నారు.పలు బెట్టింగ్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు.
జంగిల్ రమ్మీ యాప్‌కు రానా, ప్రకాశ్ రాజ్ ప్రచారం చేసినట్లు, ఏ23 యాప్‌కు విజయ్ దేవరకొండ, యోలో 247 యాప్‌కు మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్‌కు హీరోయిన్ ప్రణీత, జీట్ విన్ యాప్‌కు నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్‌కు నటి శ్యామల ప్రచారం చేసినట్లు గుర్తించారు.
ఇప్పుడు ఈ కేసులు సీఐడీకి బదిలీ అవ్వడంతో రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.