
Telangana Ias Ips : ఐఏఎస్, ఐపీఎస్‌లకు కొత్త పోస్టింగ్స్ సిఫార్స్ చేసిన ఎన్నికల సంఘం.. ఆదేశాలిచ్చిన సీఎస్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల వేళ కొత్తగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఒక్కో పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు చొప్పున అభ్యర్థుల జాబితాను ఈసీకి పంపించింది.
ఇందులో నుంచి పోస్టుకు ఒకరి చొప్పున ఎంపిక చేస్తూ సీఈసీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా అధికారులు శుక్రవారం సాయంత్రంలోగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
ఈసీ ఎంపిక చేసిన ఐఏఎస్‌లు వీరే :
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి - వాణీ ప్రసాద్
రంగారెడ్డి కలెక్టర్ - భారతీ హోలీకేరి
మేడ్చల్ కలెక్టర్ - గౌతం
యాదాద్రి కలెక్టర్ - హనుమంత్
నిర్మల్ కలెక్టర్ - ఆశీష్ సంగ్వాన్
ఎక్సైజ్,వాణిజ్య పన్నులశాఖ ముఖ్యకార్యదర్శి - సునీల్ శర్మ
Details
హైదరాబాద్ సీపీ పోస్టుకు ఇంకా ఎవరినీ ఎంపిక చేయని సీఈసీ
ఎక్సైజ్ కమిషనర్ - జ్యోతి బుద్ధప్రకాశ్
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ - క్రిస్టినా
కొత్తగా ఎంపికైన ఐపీఎస్‌ల జాబితా ఇదే :
వరంగల్ సీపీ - అంబర్ కిషోర్ జా
జగిత్యాల ఎస్పీ - సంప్రీత్ సింగ్
నిజామాబాద్ సీపీ - కల్మేశ్వర్
సంగారెడ్డి ఎస్పీ - చెన్నూరి రూపేష్
కామారెడ్డి ఎస్పీ - సింధూ శర్మ
మహబూబ్‌నగర్ ఎస్పీ - హర్సవర్ధన్
నాగర్‌కర్నూల్ ఎస్పీ - వైభవ్ రఘునాథ్
జోగులాంబ గద్వాల్ ఎస్పీ - రితిరాజ్
మహబూబాబాద్ ఎస్పీ- పాటిల్ పంగ్రామ్‌సింగ్ గణపతిరావ్
నారాయణపేట్ ఎస్పీ - యోగేష్ గౌతమ్
భూపాలపల్లి ఎస్పీ- కిరణ్ ప్రభాకర్
సూర్యాపేట ఎస్పీ- రాహుల్ హెగ్డే
హైదరాబాద్ సీపీ పోస్ట్ పెండింగ్ లో పెట్టారు.