Loading...
TG High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం

TG High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
05:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైడ్రా, శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లోతుకుంట భూముల వివాదంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. వివాదంలో ఉన్న ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో కలిసి ప్రవేశించడం చట్ట విరుద్ధ చర్యగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌ను వీలైనంత త్వరగా ఆ పదవి నుంచి బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కు సూచించింది.

వివరాలు 

ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల ఆధిపత్యం కంటే చట్టపాలనకే అత్యున్నత ప్రాధాన్యం

ఇంతకుముందు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనే కారణంతో హైడ్రా కమిషనర్‌ను తప్పించాలని సీఎస్‌కు ఆదేశించిన విషయాన్ని కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో ఆ నిర్ణయాన్ని మరింత స్పష్టం చేసింది. ఈ సందర్భంగా టాటా మోహన్‌రావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఉదహరించింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల ఆధిపత్యం కంటే చట్టపాలనకే అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేసింది.

వ్యక్తిగత అధికార ప్రదర్శన పెరిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమై, మరణశాసనంగా మారే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT