LOADING...
Telangana Heatwave: తెలంగాణలో ప్రజలకు కాస్త ఊరట.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు
తెలంగాణలో ప్రజలకు కాస్త ఊరట..

Telangana Heatwave: తెలంగాణలో ప్రజలకు కాస్త ఊరట.. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం ఏడుగంటలకే ఎండ మండిపోతుండగా, సాయంత్రం వరకు ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా వాతావరణం మారింది. ఇదిలా ఉండగా, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. సాధారణంగా ఉన్నదానికంటే ఒక డిగ్రీ వరకు తగ్గుదల నమోదైంది.

వివరాలు 

ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో మరింతగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హెచ్చరించారు. ఇదే సమయంలో ఈరోజు, రేపు, ఎల్లుండి క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వెల్లడించారు.

Advertisement