
Telangana Inter Board: జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం మూడు పీరియడ్లు యోగా..క్రీడలు..ల్యాబ్.. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం యోగా/ధ్యానం, క్రీడలు, అలాగే ల్యాబ్ కార్యకలాపాలకు మూడు పీరియడ్లు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టంచేశారు. బుధవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వారానికి ఒక రోజు యోగా లేదా ధ్యానం పీరియడ్, మరో రోజు క్రీడలకు ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు.
వివరాలు
దసరా తర్వాత తనిఖీ
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులకు ల్యాబ్ ప్రాక్టికల్స్ చేయించడంలేదన్న ఫిర్యాదులు ఉన్నందున, వారానికి ఒక పీరియడ్‌ను ల్యాబ్ కార్యకలాపాలకు కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పీరియడ్లు నిజంగా అమలు అవుతున్నాయా, ఇతర నిబంధనలను పాటిస్తున్నారా అన్న అంశాలను స్వయంగా దసరా తర్వాత తనిఖీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి...
ఆన్‌లైన్ బోధన: ఏక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారంతో సబ్జెక్టు నిపుణుల ద్వారా ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించనున్నారు. దీన్ని దసరా తర్వాత ప్రయోగాత్మకంగా 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, అలాగే 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రారంభిస్తారు. ఈ జూనియర్ కాలేజీలలో ఒక్కొక్కదానిలో నాలుగు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPs) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, తరువాత అన్ని కళాశాలల్లో ఈ విధానం అమలు చేస్తామని చెప్పారు. అధ్యాపకుల కొరత ఉన్న చోట్ల వాలంటీర్ సబ్జెక్టు నిపుణుల సహకారంతో పాఠాలు బోధించే అవకాశముందని వివరించారు.
వివరాలు
ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి...
క్రీడల విభాగం: రాష్ట్రంలోని 430 ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 17 చోట్ల మాత్రమే ఫిజికల్ డైరెక్టర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గత మార్చిలో నియమించబడిన కొత్త అధ్యాపకులకు క్రీడల బాధ్యతలను అప్పగిస్తున్నామని తెలిపారు. ప్రేరణ కోసం పూర్వ విద్యార్థుల ఫోటోలు: ఉన్నత స్థానాలు సంపాదించినవారి, జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన పూర్వ విద్యార్థుల చిత్రాలను ఆయా జూనియర్ కళాశాలల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. దీని వల్ల ప్రస్తుత విద్యార్థులు స్ఫూర్తి పొందుతారని అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి...
శంషాబాద్ కళాశాల భూములు: శంషాబాద్ జూనియర్ కళాశాలకు చెందిన 12 ఎకరాల భూమిలో జరిగిన ఆక్రమణలను ఇటీవల హైడ్రా సహాయంతో తొలగించామని తెలిపారు. ఆ స్థలాన్ని ఇంటర్ విద్యాశాఖకు అప్పగించి, భవిష్యత్తులో అక్కడ రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ప్రతిపాదనలు: ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, అలాగే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపనున్నామని వెల్లడించారు.
వివరాలు
ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి...
బడ్జెట్ కేటాయింపు: ఇంటర్ విద్యాశాఖకు బడ్జెట్‌లో రూ.954 కోట్లు కేటాయించారని, అందులో సిబ్బంది వేతనాలను తప్పించి కళాశాలల నిర్వహణకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే అందుతున్నాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం సమగ్ర శిక్షా నిధి నుంచి రూ.5.5 కోట్లు మంజూరవుతున్నాయని వివరించారు.