LOADING...
Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేస్తే క్షణాల్లో రిజల్ట్!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేస్తే క్షణాల్లో రిజల్ట్!

Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేస్తే క్షణాల్లో రిజల్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

పరీక్షలు పూర్తి చేసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. మరికొద్ది గంటల్లోనే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TSBIE) ప్రకటించిన ప్రకారం, 2026 మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం (జనరల్ & వొకేషనల్) పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12, 2026న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అధికారికంగా విడుదల చేయనున్నారు.

వివరాలు

ఆన్ లైన్ లో సులభంగా చూసుకోవచ్చు

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. ఇందుకోసం [https://tgbie.cgg.gov.in](https://tgbie.cgg.gov.in), [https://results.cgg.gov.in](https://results.cgg.gov.in) వెబ్‌సైట్లు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు అక్కడికి వెళ్లి తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే, క్షణాల్లోనే ఫలితాలను పొందే వీలుంటుంది.

Advertisement