Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2026 విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి ప్రకటించింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు https://tgbie.cgg.gov.in, https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://results.cgg.gov.in ద్వారా తమ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇంటర్ విద్యా బోర్డు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
వివరాలు
ఆన్‌లైన్‌లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్లు [https://tgbie.cgg.gov.in](https://tgbie.cgg.gov.in) లేదా [https://results.cgg.gov.inను](https://results.cgg.gov.inను) సందర్శించాలి అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి అనంతరం హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి మార్క్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది
వివరాలు
వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే విధానం
విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించారు. ఇందుకోసం 8096958096 నంబర్‌ను మొబైల్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత చాట్‌బాట్ ద్వారా వివరాలు నమోదు చేసి ఫలితాలను వెంటనే పొందవచ్చు.
వివరాలు
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేయాలి ఆ నంబర్‌కు వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ పంపాలి చాట్‌బాట్‌తో కనెక్ట్ అయి చాట్ ప్రారంభించాలి 'BIE Exam Result' అని టైప్ చేయాలి 'Start Service' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి 'Telangana BIE Results' అనే విండో ఓపెన్ అవుతుంది అందులో 'Check Result'పై క్లిక్ చేయాలి హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి, ఇయర్, జనరల్/వొకేషనల్ వంటి వివరాలు ఎంచుకోవాలి చివరగా 'Get Result'పై క్లిక్ చేస్తే ఫలితాలు వెంటనే పొందవచ్చు