
తెలంగాణ: ఇంటర్ ఫలితాల కోసం మూడు తేదీలు?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సమయం దగ్గరపడుతోంది. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మే 10వ తేదీలోగా ఇంటర్ ఫలితాలు రానున్నాయని అంటున్నారు.
ఇప్పటికే పేపర్ వాల్యుయేషన్ పూర్తయిపోయింది. ఫలితాలు విడుదల చేయడానికి అన్ని పనులు జరుగుతున్నాయని సమాచారం.
వీలైతే మే 8వ తేదీ రోజున రిలీజ్ చేస్తారట. లేదంటే 9లేదా 10 తేదీల్లో ఫలితాలు వస్తాయని వినిపిస్తోంది. ప్రస్తుతానికి అధికారిక సమాచారం రానప్పటికీ, ఖచ్చితంగా మే 10లోపు ఫలితాలు వస్తాయని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,82,619మంది ఉన్నారు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,02,630 ఉన్నారు.
Details
ఒకేసారి రెండు ఫలితాలు
ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేరోజున విడుదల చేయాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తుందని తెలుస్తోంది. నీట్, టీఎస్పీఎస్సీ పరీక్షలు దగ్గరవుతున్న నేపథ్యంలో ఇంటర్ ఫలితాలను తొందరగా విడుదల చేయాలని తెలంగా విద్యాశాఖ అనుకుంటుందని, అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
ఫలితాలను చెక్ చేసుకోవడానికి tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in అనే వెబ్ సైట్లను ఉపయోగించవచ్చు.
ఇకపోతే ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు, మే 12, 13, 14తేదీల్లో ఉండనున్నాయని విద్యాశాఖ ప్రకటించింది.