Page Loader
Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి 
డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

డ్రగ్స్‌ నిర్మూలనలో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన తెలంగాణకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని 138 దేశాలతో పోటీపడి తెలంగాణ ప్రథమ స్థానం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన 'ఎక్స్‌' (మాజీ ట్విటర్‌) వేదికగా స్పందించారు. ఈ గొప్ప విజయాన్ని దేశానికి గర్వకారణంగా పేర్కొన్న సీఎం, డ్రగ్స్‌ కట్టడిలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌, ఆయన బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Details

రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నిబద్ధతకు నిదర్శనం

తెలంగాణను డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ప్రతి పోలీసు సిబ్బందికి ప్రభుత్వమే బలంగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు, డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించేందుకు తన ప్రభుత్వం కృషి చేస్తుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ ఘనత రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నిబద్ధతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.