Telangana: దేశానికి మార్గదర్శకంగా 'తెలంగాణ'.. అవయవదానంలో అగ్రస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
అవయవదాన మహాయజ్ఞంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. జనాభా నిష్పత్తిని ప్రాతిపదికగా తీసుకుంటే, దేశంలోనే అత్యధికంగా అవయవ మార్పిడులు తెలంగాణలోనే జరిగినట్లు తెలంగాణ జీవన్‌దాన్ నోడల్ అధికారి భూషణ్‌రాజు వెల్లడించారు. 2025 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 205 మంది జీవన్మృతుల అవయవాలను దానం చేసినట్లు తెలిపారు. ప్రతి మిలియన్ జనాభాకు అయిదుకు పైగా వ్యక్తుల అవయవ దానాలు జరిగాయని పేర్కొన్నారు.
Details
గర్వంగా ఉంది : భూషణ్ రాజు
సంఖ్యాపరంగా చూస్తే తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా 268 అవయవదానాలు నమోదైనప్పటికీ, జనాభా నిష్పత్తి పరంగా తెలంగాణనే అగ్రస్థానంలో నిలిచి దేశానికి మార్గదర్శకంగా మారిందని భూషణ్‌రాజు స్పష్టం చేశారు. ఈ ఘనత సాధించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అందిస్తున్న ప్రోత్సాహం కీలకంగా నిలిచిందన్నారు . అలాగే పోలీస్ శాఖ అందిస్తున్న సమన్వయం, వైద్యులు, ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు చేస్తున్న నిరంతర కృషి వల్లే తెలంగాణ ఈ స్థాయికి చేరుకుందని ఆయన అభినందించారు.