Loading...
Telangana: మరోమారు 'ఎల్‌ఆర్‌ఎస్‌' గడువు పెంపు!.. ప్రభుత్వంలో కీలక చర్చలు
మరోమారు 'ఎల్‌ఆర్‌ఎస్‌' గడువు పెంపు!.. ప్రభుత్వంలో కీలక చర్చలు

Telangana: మరోమారు 'ఎల్‌ఆర్‌ఎస్‌' గడువు పెంపు!.. ప్రభుత్వంలో కీలక చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు ఏడాదిన్నర కాలంగా పలు దఫాలుగా గడువును పొడిగించినప్పటికీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాఖలైన దరఖాస్తుల్లోనూ అనేకం ఇంకా పరిష్కారం కాకపోవడంతో, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు పలువురు ముందుకు రావడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై రాయితీ

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేయగా, మొత్తం 25.70 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు.

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ఏడాది మార్చిలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై తొలుత 50 శాతం, ఆ తర్వాత 25 శాతం రాయితీ ప్రకటించింది.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు చెల్లించాల్సిన ఫీజులో 25 శాతం రాయితీ పొందుతూ మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే క్రమబద్ధీకరణ అనుమతులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ రాయితీ గడువును కూడా పలుమార్లు పొడిగిస్తూ వస్తుండగా, ప్రస్తుతం అమల్లో ఉన్న గడువు శుక్రవారంతో ముగియనుంది.

వివరాలు 

ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు

విశ్వసనీయ సమాచారం ప్రకారం, 'సర్' కార్యక్రమం కారణంగా ఎల్‌ఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయామని హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును మరోసారి పొడిగించాలని వారు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT