LOADING...
Telangana: తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్..? 
తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్..?

Telangana: తెలంగాణ నాయకపోడు గిరిజన మాస్క్‌లకు జీఐ ట్యాగ్..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో నివసించే నాయకపోడు తెగ ప్రత్యేకంగా చేతితో తయారు చేసే మాస్క్‌లకు భౌగోళిక గుర్తింపు(GI)ట్యాగ్ లభించే అవకాశముంది. ఈ మాస్క్‌లకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. సుమారు 700ఏళ్లుగా నాయకపోడు తరం వీటిని తయారు చేస్తోంది. ముఖ్యంగా, కాకతీయ రాజు సింగభూపాలకాల నుండి ఈ తెగ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. జీఐ రిజిస్ట్రేషన్ ప్రయత్నం: నాయకపోడు మాస్క్‌లకు జీఐ ట్యాగ్ పొందడానికి,నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ, గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ మద్దతుతో,ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (IPFC)లో GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. హైదరాబాద్‌ నుండి జీఐ ప్రాక్టిషనర్ శుభజిత్ సాహా,లీగల్ కౌన్సిల్ శ్రీవత్సు దరఖాస్తులో భాగస్వాములయ్యారు.

వివరాలు 

 11 ఏళ్ల క్రితం స్థాపించిన నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ 

నాయకపోడు ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అధ్యక్షుడు పసుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, ఇది తమ తెగకు ఒక పెద్ద మైలురాయి అని అన్నారు. ఇది నాయకపోడు కళలు, చేతిపనులను రక్షించడంలో సహాయపడటమే కాకుండా, పురాతన హస్తకళ రూపాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలో కూడా సహాయపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అంజన్ 11 ఏళ్ల క్రితం ఈ సొసైటీని స్థాపించారు. సభ్యులు మాస్క్‌ల తయారీ, మార్కెటింగ్ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) ITDA ద్వారా మార్కెటింగ్ చేయడంలో నిమగ్నం చేస్తున్నారు. వాటిని పలు వేదికలలో ప్రదర్శిస్తున్నారు

వివరాలు 

నాయకపోడు తెగ పరిచయం: 

తెలంగాణలో గోదావరి నది ఒడ్డున ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో స్థిరపడ్డ ఈ తెగ, కాలక్రమేణా ఇతర ప్రాంతాలకూ వ్యాప్తి చెందింది. వారు 14వ శతాబ్దపు సర్వజ్ఞ సింగభూపాల రాజవంశ పాలకుడికి సేవ చేశారని నమ్ముతారు. భీముడి భార్య హిడింబి తమ ఆడపడుచు అని, భీముడు తమకు చిరుధాన్యాలు పండించడం నేర్పించాడని చెప్పుకుంటున్నారు. అందువల్ల, పాండవులను కొర్రాజులు అని పిలుస్తారు. ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి వంటి గ్రామదేవతలుగా కూడా వీరు పూజిస్తారు.

వివరాలు 

ఈ మాస్క్‌లు ఎలా తయారు చేస్తారు? 

నాయకపోడు మాస్క్‌లను పొనికి చెట్టు చెక్కతో సృజించబడతాయి. రంగు కోసం రాళ్లు, చెట్ల సారం, బొగ్గు, బూడిద, అడవి వనరుల సహజ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ మాస్క్‌లు ప్రధానంగా: వీరు ప్రధానంగా కాకతీయ రాజు సింగబోయడు (సింగభూపాలుడు), భూలక్ష్మి దేవర, ఐదుగురు పాండవులు (కొర్రాజులు), పోతరాజు, వరాహ రాజు, ఎర్రగొండ రాకాసి, నల్లగొండ రాకాసి, అశ్వం (గుర్రం), ఒక జింక ముఖానికి మాస్క్‌లుగా తయారు చేస్తారు.