LOADING...
CV Anand: తెలంగాణ పోలీసులు అదుపులో పైరసీ ముఠా.. సినిమా పరిశ్రమకు రూ.3700 కోట్ల మేర నష్టం
తెలంగాణ పోలీసులు అదుపులో పైరసీ ముఠా.. సినిమా పరిశ్రమకు రూ.3700 కోట్ల మేర నష్టం

CV Anand: తెలంగాణ పోలీసులు అదుపులో పైరసీ ముఠా.. సినిమా పరిశ్రమకు రూ.3700 కోట్ల మేర నష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ముఠా తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేశారని గుర్తించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివరించినట్టు ఈ ముఠా వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు రూ.3,700కోట్ల నష్టం అందిందని, నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, పైరసీ టెలిగ్రామ్ ఛానెల్స్, టోరెంట్స్ ద్వారా జరుగుతోంది.కొత్తగా ఎంవో విధానంలోనూ సినిమాలను థియేటర్లలో కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీ చేస్తున్నారు. డిజిటల్ శాటిలైట్ హ్యాకింగ్ ద్వారా కూడా సినిమాలు పైరసీకి పాల్పడుతున్నట్లు గుర్తించారు.ముఖ్యంగా, 'సింగిల్' 'హిట్' సినిమాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి.

Details

పైరసీ కోసం నెదర్లాండ్స్‌లోని ఐపీ అడ్రస్‌ లు

ఇందులో జానా కిరణ్‌కుమార్‌ ప్రధాన నిందితుడు. నిందితులు హైఎండ్ కెమెరా కలిగిన సెల్‌ఫోన్లను జేబులో, పాప్‌కార్న్ డబ్బాలో గానీ దాచిపెట్టి సినిమాలు రికార్డింగ్ చేస్తారు. ఇప్పటివరకు కిరణ్ ముఠా ప్రత్యేక యాప్ ద్వారా 40 సినిమాలను పైరసీ చేసింది. రికార్డింగ్ సమయంలో సెల్‌ఫోన్ స్క్రీన్‌లైట్ ఆఫ్ చేయడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు తెలిపారు. ఇతర భాషల సినిమాలను రికార్డింగ్ చేసేందుకు ఏజెంట్లను కూడా నిక్షేపించారు. పైరసీ కోసం నెదర్లాండ్స్‌లోని ఐపీ అడ్రస్‌లను వాడారు. ఈ ముఠాను పట్టుకోవడానికి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించామని, నిందితులు ఎప్పటికీ పట్టుకోలేనని అనుకున్నారని, బెట్టింగ్ యాప్‌ల ద్వారా నిందితులకు నెలకు సుమారు రూ.9 లక్షల చెల్లింపులు జరిగాయి.