Page Loader
Telangana police: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు 
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు

Telangana police: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసుల కీలక సూచనలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి తెలుగు ప్రజల అతి ముఖ్యమైన పండుగ. ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఉద్యోగాలు, వ్యాపారాలు, వాణిజ్య వ్యహారాలు వంటివాటితో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు, ఈ పండుగ సమయంలో తమ సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ కారణంగా నగరాల్లో చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. ప్రజలు ఊర్లకు వెళ్లిపోవడంతో నగరంలోని కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారతాయి. ఈ పరిస్థితిని దొంగలు తమ అనుకూలంగా మార్చుకుని, తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడతారు. ఈ నేపథ్యంలో పండుగ సమయంలో సొంత ఊర్లకు వెళ్లే వారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు.

వివరాలు 

ఊరెళ్లే వారు తమ అడ్రస్, ఫోన్ నెంబర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి 

తాళంవేసిన ఇంటిని దొంగల నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అమర్చుకోవడం,అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయడం,ఇంట్లో లైట్లు వేసి వెళ్లడం,బంగారం,నగదు వంటి విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచకపోవడం,తాళం వేసిన ఇంటికి కర్టెన్ ద్వారా కవరింగ్ చేయడం,పక్కింటి వారితో సమాచారం పంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఊరెళ్లే వారు తమ చిరునామా,ఫోన్ నంబర్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయడం,వాహనాలను రోడ్డు మీద కాకుండా ఇంటి ఆవరణలో పార్క్ చేయడం,సీసీ కెమెరాలను ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలించడం వంటి సూచనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ సూచనలను పాటించడం ద్వారా దొంగల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ పోలీసులు చేసిన ట్వీట్